భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్య సంస్థలు వైద్య సంస్థల చట్టంలోని నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో రోగుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు, ఇతర అవాంఛనీయ ఘటనలకు…






