భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న నర్సాపూర్ పట్టణంలో మాంసం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ఈ మేరకు పట్టణంలోని సమస్త మాంసం విక్రయదారులకు నోటీసులు జారీ చేశారు.

గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న పట్టణ పరిధిలో చేపలు, చికెన్, మటన్‌తో పాటు ఇతర మాంసం విక్రయించరాదని నోటీసుల్లో స్పష్టం చేశారు. మున్సిపల్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మాంసం విక్రయించినట్లయితే…