భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఆధ్యాత్మిక చింతనతో ప్రతి ఒక్కరిలో మానసిక ప్రశాంతత, సానుకూల ఆలోచనలు పెరుగుతాయని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగాలని సూచించారు.
చిన్నశంకరంపేట గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ 10వ వార్షికోత్సవ వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమం, పుణ్యవచనం, నవగ్రహ పూజలతో పాటు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల…






