భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సాంప్రదాయంలో బతుకమ్మ పండుగకు ముందు వచ్చే బొడ్డెమ్మ పండుగను ఇనుగుర్తి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో గురువారం భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. భాద్రపద మాసంలో వినాయక చవితి అనంతరం బహుళ పంచమి రోజున ప్రారంభమయ్యే ఈ పండుగను మహాలయ అమావాస్య వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో బాలికలు, యువతులు, మహిళలు పుట్ట మట్టిని తీసుకువచ్చి సాక్షాత్తు గౌరీదేవిగా భావించి బొడ్డెమ్మలను తయారు చేశారు. సాయంత్రం వేళ తీరొక్క…






