భారత్ సమాచార్, హైదరాబాద్ : మల్లారెడ్డి విద్యాసంస్థల్లో సినీ కార్యక్రమాల నిర్వహణపై వస్తున్న విమర్శలు, వివాదాల నేపథ్యంలో యాజమాన్యం స్పందించింది. ఈ క్రమంలో మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ చైర్మన్, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిశారు. కమిషన్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో విద్యాసంస్థల ప్రాంగణాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వాటి ప్రభావం, విద్యార్థుల భద్రత వంటి అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కమిషన్ లేవనెత్తిన సందేహాలు, ప్రశ్నలకు ప్రీతిరెడ్డి వివరణ ఇచ్చారు.
భేటీ అనంతరం…






