భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలోని బేటి చెరువు భూమి ఆక్రమణకు గురవుతోందని, చెరువు పక్కనే తవ్వకాలు నిర్వహిస్తున్న గ్రాన్ మార్ట్ ఎక్స్పోర్ట్, శ్రీనివాస గ్రానైట్ క్వారీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచి తమ్మడపల్లి కుమార్ అధికారులను కోరారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు ప్రజావాణిలో కూడా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
గ్రానైట్ క్వారీల్లో తవ్వకాలు జరిపిన తర్వాత వెలువడే వేస్ట్ రాళ్లు,…






