భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు అంజుమ్ సుల్తానాకు అరుదైన గౌరవం లభించింది. హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో ఆమెకు ప్రతిభా పురస్కారం అందజేసి ఘనంగా సన్మానించారు.

మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకొని గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యారంగంలో అంజుమ్ సుల్తానా చేస్తున్న నిరుపమాన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. అంజుమ్ సుల్తానా, అబ్దుల్…