భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బొడ్డెమ్మ పండుగను పురస్కరించుకుని మండల కేంద్రం ఇనుగుర్తిలోని యాదవ బజారులో మహిళలకు ఆదివారం చీరలు పంపిణీ చేశారు. గ్రామంలోని 10వ వార్డు సభ్యురాలు గాడుదుల సరిత రాజన్న తన సొంత ఖర్చుతో రూ.15 వేల విలువైన 30 చీరలను మహిళలకు అందజేశారు.
ఈ సందర్భంగా వార్డు సభ్యురాలు సరిత రాజన్న మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పండుగ వేళ మహిళలతో ఆనందాన్ని…






