భారత్ సమాచార్, తిరుమల: శ్రీ మహావిష్ణువు పాదపద్మాల నుంచి ఉద్భవించి, బ్రహ్మదేవుని కరస్పర్శతో పవిత్రమై, సనక, సనందనాది మహాయోగులచే కొనియాడబడిన పవిత్ర తీర్థం శ్రీ స్వామి పుష్కరిణి. దక్షిణ భారతదేశానికి మకుటాయమానంగా వెలుగొందుతున్న తిరుమల క్షేత్రంలో ఈ తీర్థానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది.

తిరుమల క్షేత్రంలో సర్వకామదాయకమైన అరవై ఆరు కోట్ల తీర్థాలు ఉన్నాయని బ్రహ్మపురాణం తెలియజేస్తోంది. వీటిలో శ్రీవారి ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న స్వామి పుష్కరిణి మహత్తరమైన తీర్థంగా ప్రసిద్ధి చెందింది.

వైకుంఠం నుంచి తిరుమలకు..

పురాణాల ప్రకారం వైకుంఠం…