భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వృద్ధ దంపతుల ఇంట్లో భద్రపరిచిన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురికాగా.. పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకుని చోరీకి గురైన సొమ్మును రికవరీ చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది.
ఎస్సై కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లికుదురు మండలం దుర్గాభవాని గ్రామపంచాయతీ పరిధిలోని రామోజీ తండాకు చెందిన జాటోత్ బుల్లి, జాటోతు పులాని దంపతులు ఇద్దరే ఇంట్లో నివసిస్తున్నారు. వీరు తమ ఇంట్లోని సందుకలో ఒక తులం బంగారు ఆకుల…






