భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ పండుగ ఇనుగుర్తి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. పండుగ సందర్భంగా యువతులు, మహిళలు బొడ్డెమ్మ భక్తి గీతాలు, కోలాట పాటలతో ఆడిపాడుతూ సందడి చేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా బొడ్డెమ్మను కొలుస్తూ పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు.

చిన్ననాగారంలో ప్రత్యేకంగా..

చిన్ననాగారం గ్రామంలోని అంబేద్కర్ కమిటీ హాల్ వద్ద బొడ్డెమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. యువతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బొడ్డెమ్మ కోలాట పాటలతో ఆడిపాడుతూ ఉత్సాహంగా…