భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దీక్షా దివస్ ఫ్లెక్సీ తొలగింపు వివాదం రగడకు దారితీసింది. ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తొలగించడంపై BRS నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ తొలగించిన ఫ్లెక్సీతోనే అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఫ్లెక్సీల తొలగింపు విషయంలో అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు.
ఈ నెల 29న కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించి BRS నాయకులు గురువారం రాత్రి…






