భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా తమ వంతు సహకారం అందిస్తూ ఏజేఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో ముందుంటోంది. ఈ క్రమంలో వలిగొండ మండలం పహిల్వాన్పూర్ గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి ఫౌండేషన్ అండగా నిలిచి, ఆడపడుచు వివాహానికి ఆర్థిక సాయం అందజేసింది.
పహిల్వాన్పూర్ గ్రామానికి చెందిన బండారి పద్మ, మారయ్య దంపతుల కుమార్తె బండారు స్వాతి వివాహ వేడుకను పురస్కరించుకుని ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి రూ.10 వేల ఆర్థిక సాయం…






