భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండల కేంద్రంలో గురువారం (అక్టోబర్ 15) స్మార్ట్ రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. స్థానిక దేవి శ్రీ గార్డెన్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను వలిగొండ తహశీల్దార్ దశరథ వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి భువనగిరి MLA కుంభం అనిల్కుమార్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయన చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల…






