భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని వన్ ప్యాలెస్ రెస్టారెంట్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. రెస్టారెంట్‌లో ఆహారం తీసుకున్న పలువురు అస్వస్థతకు గురికాగా, వారిలో చికిత్స పొందుతున్న సాయిరాం అనే యువకుడు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో తీరని విషాదం నెలకొనగా, పట్టణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

15 మందికి అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స

నర్సాపూర్‌లోని వన్ ప్యాలెస్ రెస్టారెంట్‌లో భోజనం చేసిన 15 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం.…