భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి మండలం కులబ్గూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 228, 235లో ఉన్న వివాదాస్పద భూమిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన పంచాయతీ కార్యదర్శి శారద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు ముస్తఫా, సలీం ఖాన్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదా?
వివాదాస్పద భూమిలో నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై…






