భారత్ సమాచార్, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతుల పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంటలు చేతికొచ్చే వరకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కోతలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. వచ్చే 20 రోజులు పంటలకు అత్యంత కీలకమని, విద్యుత్ కొరత కారణంగా రైతులు పంటలు నష్టపోయే పరిస్థితి రాకూడదని ఆదేశించారు.

విద్యుత్ సరఫరాపై సీఎం సీరియస్

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, విద్యుత్ ఉత్పత్తి,…