భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. హిందూ వాహిని యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎనిమిదో రోజు నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, భారీ చండీయాగం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

కుంకుమార్చన.. భారీ చండీయాగం

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కుంకుమార్చనలో భక్తులు పాల్గొని అమ్మవారికి…