భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని కోమటిపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామానికి చెందిన స్టార్ యూత్ యువకులు అధికారులను కోరారు. స్థానిక మాజీ సర్పంచ్ నీలం యాకయ్యతో కలిసి బస్ డిపో మేనేజర్ ఛాంబర్లో వినతిపత్రం అందజేశారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ బస్సులు నడవకపోవడంతో ప్రజలు నిత్యం ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు.
బస్సులు లేక ప్రజలకు ఇబ్బందులు
ఈ సందర్భంగా స్టార్ యూత్ అధ్యక్షుడు ఉమ్మగాని హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేష్…






