భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఫోటో ఆల్బమ్ అందించేందుకు స్నేహితుడితో కలిసి బైక్పై బయలుదేరిన యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నర్సాపూర్ మండల పరిధిలో జరిగిన ఈ ప్రమాదం చిలిప్చెడ్ మండలం సమ్లా తండాలో విషాదాన్ని నింపింది. కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న చిన్న కుమారుడు మృత్యువాత పడటంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
నర్సాపూర్ పోలీస్ స్టేషన్ వివరాల ప్రకారం.. అక్టోబర్ 25వ తేదీ రాత్రి సుమారు 11:10 గంటలకు పెద్దచింతకుంట గ్రామ శివారులోని జల…






