భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బాలలపై లైంగిక నేరాలకు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని సీనియర్ న్యాయవాది సి.హెచ్. స్వరూపరాణి తెలిపారు. బాలికలు, బాలుర పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటి నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నర్సాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల…






