భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సీఎంఆర్ బకాయిల చెల్లింపులు, పెండింగ్ బియ్యం డెలివరీల విషయంలో రైస్ మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ హెచ్చరించారు. ప్రభుత్వ ఉత్తర్వులు, ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా బకాయిలను పరిష్కరించడంతో పాటు, నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం బియ్యం సరఫరాను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
సోమవారం మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో టాస్క్ఫోర్స్ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రైస్ మిల్లుల యాజమాన్యాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంఆర్…






