భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: దేశ రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని భైంసా ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్ స్వయంగా బైక్ నడుపుతూ పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ర్యాలీ స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైంది. అక్కడి…