భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: జిల్లాలోని ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, రోగ నిర్ధారణ కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. వైద్య సేవల్లో నాణ్యతను పెంచడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.

గురువారం కలెక్టరేట్‌లో మెడికల్, డ్రగ్స్ విభాగాల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వైద్య సేవల నిర్వహణ, ఔషధ దుకాణాలు, రోగ నిర్ధారణ కేంద్రాల పనితీరుపై సమీక్షించారు. అధికారులు తరచూ తనిఖీలు…