భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇప్పటి నుంచే నీటి సంరక్షణపై దృష్టి సారించాలని రామాయంపేట తహసీల్దార్ రజనీకుమారి సూచించారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం రామాయంపేట మండల పరిధిలోని రాయిలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సోక్‌పిట్‌ను తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణ కోసం గ్రామంలో చేపడుతున్న చర్యలను పరిశీలించి, భవిష్యత్తులో…






