భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) చిన్న శంకరంపేట శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్న శంకరంపేట మండలంలోని ఎంపీ యూపీఎస్ మాందాపూర్ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నడియాడ్‌లో జూవేర్‌భాయ్ పటేల్, లడ్బా దంపతులకు జన్మించారని తెలిపారు.…