భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలోని మనోహరాబాద్ మండలాన్ని మాత్రమే కరువు మండలంగా ప్రకటించడంపై తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా గుర్తించి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ సమితి జిల్లా అధ్యక్షుడు అక్కమొల్ల మైసయ్య యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మైసయ్య యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో పంట నష్టాలను…






