భారత్ సమాచార్, మెదక్ జిల్లా: యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తూ పంట మార్పిడిని పాటించాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. రామాయంపేట రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ఖేత్ బచావో అభియాన్’ (KBA) కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నేల పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించడం, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, పంట అవశేషాల నిర్వహణ, పంటల వైవిధ్యీకరణ, నీటి సంరక్షణ వంటి అంశాలను అధికారులు…






