భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలో అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి, హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ జె. శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్‌తో కలిసి పట్టణంలో పర్యటించి వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న రెండు అమృత్ 2.0 వాటర్ ట్యాంకులతో పాటు రాయారావు చెరువు, వాటర్ బాడీ పునరుజ్జీవన పనులను తనిఖీ చేశారు. పనులు ఏ దశలో ఉన్నాయనే…