భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని ఇనుగుర్తి సర్పంచి తమ్మడపల్లి కుమార్ అన్నారు. పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కుటుంబ వాతావరణమే పునాది అని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఇనుగుర్తి ZPHSలో హెచ్ఎం అమ్మ యాకయ్య అధ్యక్షతన గురువారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు ఇల్లే మొదటి పాఠశాలని, తల్లిదండ్రులే తొలి గురువులని తెలిపారు.…