భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: సిద్దిపేట–హుస్నాబాద్ ప్రధాన రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామ శివారులో జరిగిన ఈ ప్రమాదంలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (33), ఆయన కుమార్తె మహాన్వి (9) ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకూతుళ్ల పార్థివ దేహాలకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ…






