భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ ఉద్యమానికి తన పాటలతో ఊపిరి పోసి, ప్రజల్లో చైతన్యం నింపిన ప్రజాకవి అందెశ్రీకి వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్‌లో ఘనంగా నివాళులర్పించారు. జయ జయహే తెలంగాణ గీత రచయిత అందెశ్రీ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం మండల కేంద్రం ఇనుగుర్తిలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

పాఠశాల కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అందెశ్రీ చిత్రపటానికి కట్టయ్య యాదవ్‌తో పాటు ఉపాధ్యాయ బృందం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.…