భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను BJP ఎండోమెంట్ సెల్ మెదక్ జిల్లా జాయింట్ కన్వీనర్, హనుమాన్ సేన రాజిరెడ్డి తీవ్రంగా ఖండించారు. దేవాలయాన్ని సందర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఆలయంలో విగ్రహం ధ్వంసం కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం మారిన…






