భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూముల రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమంలో భాగంగా రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామంలో భూముల రీ సర్వే ప్రారంభమైంది. మంగళవారం గ్రామంలో తహసీల్దార్ రజనీకుమారి ఆధ్వర్యంలో క్యాడర్ స్టైల్ రీ సర్వే పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ.. గ్రామంలోని భూముల హద్దులు, విస్తీర్ణం, భూ రికార్డుల్లో నమోదైన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయనున్నట్లు తెలిపారు.…