భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బాలల హక్కుల పరిరక్షణ, వారి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నెల్లికుదురు మండలం బడి తండాలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ (VCPC)ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా గ్రామ సర్పంచ్ బిలావత్ ధనమ్మ అమృ నాయక్, కన్వీనర్‌గా స్థానిక అంగన్వాడీ టీచర్ వి. కవిత వ్యవహరించనున్నారు.
ఈ మేరకు బుధవారం స్థానిక పాఠశాలలో ICDS సూపర్వైజర్ జలగం సునీత సమక్షంలో 15 మంది సభ్యులతో కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ సునీత మాట్లాడుతూ.. పిల్లలపై జరిగే…






