భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: స్నేహానికి మరణం లేదని నిరూపించారు ఆ బాల్యమిత్రులు. తమతో కలిసి చదువుకుని, ఆడిపాడిన స్నేహితుడు అకాల మరణం చెందడంతో.. అతడి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. స్నేహితుడి కూతురి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పిస్తూ తమ ఉదారతను చాటుకున్నారు. ఈ హృదయాన్ని తాకే ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్ గ్రామంలో చోటుచేసుకుంది.
కాచికల్ గ్రామానికి చెందిన చిలుక రవి ఇటీవల అకాల మరణం చెందారు. దీంతో ఆయనతో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన బాల్యమిత్రులైన కాంగ్రెస్…






