భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: గ్రామాల్లో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు నేరాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజలకు మరింత చేరువై, వారి సమస్యలను తెలుసుకుంటూ పోలీసులపై నమ్మకాన్ని పెంచే లక్ష్యంతో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కోహెడ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సుమారు 50 వాహనాల పత్రాలను పరిశీలించడంతో పాటు అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ ACP సదానందం…