భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నీటి పొదుపు, పశుగ్రాసం సంరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రాబోయే రోజుల్లో తాగునీరు, పశువుల నీటి అవసరాలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని ఆర్. వెంకటాపూర్, సుతార్ పల్లి గ్రామాల్లో గురువారం ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మండల అభివృద్ధి, వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల, పశుసంవర్ధక శాఖల అధికారులు ఈ…