భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బాలికల వసతి గృహాల్లో విద్యార్థినులకు అందుతున్న సదుపాయాలు, భోజనం నాణ్యతను తెలుసుకునేందుకు రామాయంపేట తహసీల్దార్ రజనీకుమారి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని TG సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల బాలికల వసతి గృహాన్ని గురువారం ఆమె సందర్శించారు.

రాత్రి భోజన సమయంలో హాస్టల్‌కు చేరుకున్న తహసీల్దార్.. విద్యార్థినులకు వడ్డిస్తున్న ఆహారాన్ని స్వయంగా పరిశీలించారు. భోజనం నాణ్యత, వంటకు ఉపయోగిస్తున్న సరుకులు, నిత్యావసర వస్తువుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందించే…