భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడంతోపాటు ఉపాధ్యాయుల బాధ్యతలను వారికి పరిచయం చేసే ఉద్దేశంతో హుస్నాబాద్‌లోని కేరళ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నవంబర్ 14న జరుపుకునే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఈ కార్యక్రమాన్ని ముందస్తుగా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా మారి తరగతి గదుల బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా పాఠాలు వినే విద్యార్థులే టీచర్ల స్థానంలో నిలబడి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉపాధ్యాయులుగా…






