భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇనుగుర్తి మండల కేంద్రంలోని విజ్ఞాన్ హై స్కూల్‌లో శుక్రవారం విద్యార్థులకు వివిధ రకాల సృజనాత్మక, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ గంజి అర్చన రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అర్చన రెడ్డి మాట్లాడుతూ.. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ రోజును పురస్కరించుకుని విద్యార్థుల్లో…