భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. న్యూ క్లాసిక్ గార్డెన్స్ సమీపంలో వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు రెండు బైక్‌లను ఢీకొట్టడంతో మెదక్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహమ్మద్ తాహెర్ (54) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆయన కుమారుడు మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ (19)తో పాటు మరో బైక్‌పై ఉన్న చిగురు ప్రదీప్ (27), తలారి నవీన్ (27) తీవ్రంగా…