భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ సర్కిల్ పరిధిలో పోలీసుల పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించేందుకు తూప్రాన్ ఉప పోలీసు అధికారి (DSP) నర్సాపూర్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పోలీస్ రికార్డులు, సర్కిల్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ముఖ్యంగా పెండింగ్లో ఉన్న కేసులు, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న కేసుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, దర్యాప్తు ఏ దశలో ఉందనే వివరాలను సమీక్షించారు. పెండింగ్ కేసులను…






