భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని అర్హులైన పేదలకు ప్రభుత్వం కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేసింది. మండలానికి మొత్తం 338 కొత్త పింఛన్లు మంజూరైనట్లు ఎంపీడీవో బండారి పార్థసారధి తెలిపారు. ఈ పింఛన్ల పంపిణీ ప్రారంభ కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీ మంగళవారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మండల కేంద్రం ఇనుగుర్తితో పాటు వివిధ గ్రామాలకు చెందిన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు తదితరులకు కొత్త పింఛన్లు మంజూరయ్యాయని ఎంపీడీవో పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పింఛన్ల ద్వారా…