భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పశువుల ఆరోగ్యం, గర్భధారణ సమస్యల పరిష్కారం కోసం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నైనాల గ్రామంలో బుధవారం ప్రత్యేక ఫెర్టిలిటీ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ యాసం సంధ్య రమేష్ ప్రారంభించారు. పశువులకు అందిస్తున్న వైద్య సేవలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పాడి రైతులు తమ పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పశుసంవర్ధక శాఖ అందిస్తున్న సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు. పశువులకు గర్భధారణ సంబంధిత సమస్యలు…






