భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం (నవంబర్ 19) మండల కేంద్రం ఇనుగుర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సమావేశానికి మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలతో పాటు సంబంధిత శాఖల అధికారులు, విధులు కేటాయించిన అంగన్వాడీ టీచర్లు హాజరుకావాలని తహసిల్దార్ కోరారు.…