భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సిద్దిపేటలో గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు వెల్దుర్తి మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ సభ నిర్వహించారు. ముఖ్యమంత్రి పాల్గొంటున్న కార్యక్రమం కావడంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా బయలుదేరి సభకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ…