భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: వరి పంట కోత తర్వాత పొలాల్లో మిగిలే పంట అవశేషాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వినియోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి వేల్పుల పూజ రైతులకు విజ్ఞప్తి చేశారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల పర్యావరణానికి నష్టం కలగడంతో పాటు భూమిలోని సహజ పోషకాలు కూడా తగ్గిపోతాయని ఆమె వివరించారు.

వరి గడ్డిని కాల్చడం వల్ల పొలాల్లో ఉండే సేంద్రియ పదార్థాలు, మిత్ర పురుగులు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తాయని తెలిపారు. అంతేకాకుండా అవశేషాలను కాల్చినప్పుడు వెలువడే పొగతో వాయు…