భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు మండల స్థాయి క్విజ్ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. విద్యార్థుల్లో సాధారణ పరిజ్ఞానంపై ఆసక్తి పెంచే లక్ష్యంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్విజ్ పోటీలను ఆమె శుక్రవారం పరిశీలించారు.
చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఈ పోటీలు నిర్వహించారు. మండలంలోని ZPHS పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూల్ విద్యార్థులు…






