భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్-నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు ముందుగానే అప్రమత్తమై వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. తక్కువ నీటిని వినియోగిస్తూ మంచి దిగుబడులు సాధించే ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని, నీటి వనరులను పొదుపుగా ఉపయోగించుకోవాలని తెలిపారు.
నర్సాపూర్ మండలంలోని రాంజ్య తండా, మొహమ్మదాబాద్ గ్రామాల్లో ఎల్-నినో ప్రభావాలు, నీటి సంరక్షణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు…






